ఆర్థిక పరిస్థితిపై 18న శ్వేతపత్రం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రం వెలువరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఆర్థికశాఖ నిర్వహించిన కసరత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు.

Published : 11 Jul 2024 03:58 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రం వెలువరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఆర్థికశాఖ నిర్వహించిన కసరత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు పీయూష్‌కుమార్, వినయ్‌చంద్, జానకి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులూ హాజరయ్యారు. బుధవారం ఇందుకు సంబంధించిన అంశాలు కొలిక్కి రాలేకపోవడంతో మరోసారి సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని