కృష్ణా డెల్టాకు నీటి విడుదల

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి కాలువ చివరి భూముల వరకూ సాగునీరు అందించడానికి సీఎం చంద్రబాబు సంకల్పించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Published : 11 Jul 2024 03:58 IST

సీఎం చంద్రబాబు సంకల్పంతోనే సాధ్యమైందన్న మంత్రి నిమ్మల

కాలువలకు నీటిని విడుదల చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. చిత్రంలో మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బొండా ఉమా, మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్‌ తదితరులు

ఈనాడు, అమరావతి; తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి కాలువ చివరి భూముల వరకూ సాగునీరు అందించడానికి సీఎం చంద్రబాబు సంకల్పించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, తాగునీరూ అందించలేక చేతులు ఎత్తేసిందని విమర్శించారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదల చేశారు. అంతకుముందు రెగ్యులేటర్ల వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు నాలుగేళ్లుగా పనిచేయకపోయినా.. కేవలం 15 రోజుల్లో మరమ్మతులు చేశామన్నారు. గోదావరి నీళ్లు పట్టిసీమ నుంచి కృష్ణాకు తెచ్చి.. అంతే వేగంగా డెల్టాకు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, ఎస్‌ఈలు ప్రసాద్‌బాబు, ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


కాలువలకు వెళ్తున్న నీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని