జలవనరుల శాఖలో ఎఫ్‌ఏసీలు వద్దు

జలవనరుల శాఖలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో పలువురు అధికారులకు ఇచ్చిన పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్‌ఏసీ) రద్దు చేయాలని ఆ శాఖ ఏపీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

Published : 11 Jul 2024 04:21 IST

అర్హులకే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌
వాడీవేడిగా ఏపీ ఇంజినీర్స్‌ సంఘం సమావేశం

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జలవనరుల శాఖలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో పలువురు అధికారులకు ఇచ్చిన పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్‌ఏసీ) రద్దు చేయాలని ఆ శాఖ ఏపీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఎఫ్‌ఏసీల పేరిట జూనియర్లకు అడ్డగోలు ఉద్యోగోన్నతులు ఇవ్వడం సరికాదని పేర్కొంది. అర్హతలు ఉన్న వారికే ఉద్యోగోన్నతి కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం విజయవాడలోని కె.ఎల్‌.రావు భవన్‌లో ఏపీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మరి కొద్ది నెలల్లో పదవీ విరమణ దగ్గరపడుతోందని.. ఉద్యోగోన్నతి కోసం ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలంటూ పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరి కొద్ది రోజులు వేచి చూస్తామని, ఫలితం లేకుంటే సహాయ నిరాకరణతోపాటు, ఉద్యమించడానికి వెనుకాడే ప్రసక్తే లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డోలా తిరుమలరావు, కాటూరి శ్రీనివాసరావు, సహాధ్యక్షుడు శేషం తిరుమలరావు, కోశాధికారి విజయలక్ష్మి, ఉత్తరాంధ్ర సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు, ఏఈఈల అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌రాజా, జోన్‌-2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుంభా రాంబాబు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మాట్లాడారు. అనంతరం పరిపాలనా విభాగ ఈఎన్‌సీ కె.శ్రీనివాసరావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని