పిడుగురాళ్లలో అతిసారానికి మరో ముగ్గురి బలి

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో డయేరియా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అతిసారంతో ముగ్గురు మరణించారు.

Published : 11 Jul 2024 04:21 IST

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మరొకరు

పిడుగురాళ్ల, సీతానగరం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో డయేరియా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అతిసారంతో ముగ్గురు మరణించారు. స్థానిక లెనిన్‌నగర్, మారుతీనగర్‌లకు చెందిన 45 మంది వరకు వ్యాధి బారినపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో బండారు వెంకటేశ్వర్లు (70), తమ్మిశెట్టి తిరుపతమ్మ (56) గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మంగళవారం రాత్రి కాంతమ్మ (70) ప్రాణాలు కోల్పోయింది. ఈ ముగ్గురితో కలిపి గత వారం రోజుల వ్యవధిలో ఇక్కడ ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో అతిసారంతో చికిత్స పొందుతూ వ్యవసాయ కూలీ బేదంపూడి జగన్నాథం (60) బుధవారం మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన పెంటా సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉందని సీతానగరం పీహెచ్‌సీ ప్రధాన వైద్యుడు ఏవీకే చైతన్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని