విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు మంత్రి

విశాఖ ఉక్కు కర్మాగారంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో సందర్శించేందుకు కేంద్ర పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ.కుమారస్వామి బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు.

Published : 11 Jul 2024 04:24 IST

కేంద్ర మంత్రి కుమారస్వామితో విశాఖ ఉక్కు సీఎండీ అతుల్‌ భట్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో సందర్శించేందుకు కేంద్ర పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ.కుమారస్వామి బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అంతకుముందే మరో విమానంలో ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ వచ్చారు. కేంద్ర మంత్రులకు విశాఖ ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉక్కు  పరిశ్రమ సీఎండీ అతుల్‌ భట్, ఎమ్మెల్యేలు పి.గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గురువారం స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో సందర్శించి, ఇక్కడి పరిస్థితులపై ఆరా తీస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని