Andhra News: పొలంలో బంగారం ‘పండింది’.. ఆయిల్‌పాం తోటలో బంగారు నాణేలు!
ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికిన ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికిన ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో గత నెల 29న ఇవి లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రామంలో మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్‌పాం తోటలో పైపులైన్ కోసం తవ్వుతుండగా బంగారు నాణేలున్న మట్టి పిడత దొరికింది. ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన తహసీల్దారు పి.నాగమణి వచ్చి నాణేలతోపాటు వాటిని ఉంచిన మట్టి పిడతను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నాయని నిర్ధారించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: క్యాప్షన్లేని రష్మిక ఫొటోలు.. కేతిక ‘ఫిబ్రవరి ఫీల్స్’!
-
Politics News
Yuvagalam-Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్ చేసిన పోలీసులు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?
-
Movies News
OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్
-
Sports News
Virat Kohli: ‘నువ్వు వెళ్లే మార్గం నీ మనస్సుకు తెలుసు.. అటువైపుగా పరుగెత్తు’: విరాట్ కోహ్లీ
-
General News
Polavaram: పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ స్పష్టత