Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 21 Jun 2024 05:23 IST

ప్రమాణం చేయించిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ఈనాడు, అమరావతి: రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాలులో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు సంబంధిత నియామక పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు చదివి వినిపించారు. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎస్‌.సవిత, ఎం.రామ్‌ప్రసాదరెడ్డి, శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, భూమా అఖిలప్రియ, అదితి గజపతిరాజు, బొండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, విజయ్‌కుమార్‌ తదితరులు బుచ్చయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని