
Heavy Rain: దిగుబడిలో డీలా
భారీవర్షాలతో అనుకూలించని వాతావరణం
పూత ఆలస్యం.. దిగుబడులపై తీవ్ర ప్రభావం
ఎకరాకు టన్ను నుంచి రెండు టన్నులే
ఈనాడు, అమరావతి: మామిడి పండించే రైతుకు ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా తయారయ్యాయి. సమయానికి పూత రాకపోవడంతో పాటు తామరపురుగు ప్రభావమూ కన్పిస్తోంది. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ దిగుబడిలో 20 నుంచి 30 శాతం మేర మాత్రమే వచ్చే పరిస్థితులున్నాయి. దీంతో పెట్టుబడి కూడా చేతికొచ్చేట్లు లేదని రైతులు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో కొద్ది రోజులుగా బంగినపల్లి రకం మామిడి కోతలు మొదలయ్యాయి. దిగుబడులు పడిపోయిన నేపథ్యంలో ధరలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. సాధారణంగా డిసెంబరు, జనవరి నాటికి చెట్లు పూతలతో కళకళలాడుతుంటాయి. అయితే గత అక్టోబరు, నవంబరులో కురిసిన భారీ వర్షాలకు.. తేమ అధికమైంది. పొడి వాతావరణం లేకపోవడంతో పూత ఏర్పడలేదు. జనవరి వచ్చినా.. కొన్ని తోటల్లో పూత 20 నుంచి 30 శాతమే ఏర్పడింది. దీని కోసం మందుల్ని పిచికారి చేశారు. ఫలితంగా పెట్టుబడి పెరిగింది. అంతలోనే మంచు అధికం కావడంతో పూత రాలిపోయింది. పిందె సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమూ నష్టానికి కారణమైంది. ప్రస్తుతం చాలా తోటల్లో పూత, పిందె, కాయలున్నాయి. ‘నవంబరులో రావాల్సిన పూత జనవరిలో వచ్చింది. అదీ మంచు కారణంగా నిలవలేదు. దీంతో ఎకరాకు టన్ను రావడం కూడా కష్టంగా ఉంది’ అని విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లె రైతు తిరుపతిరావు అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మామిడికి తామరపురుగు ఆశించింది. పూత నిలవనీయలేదు. దీంతో దిగుబడులు క్షీణించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. పూతతోపాటు పిందెపైనా తీవ్ర ప్రభావం పడింది. విజయనగరం జిల్లాలో సువర్ణరేఖ, పణుకుల రకాల కోత ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది. సువర్ణరేఖను ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది అధికశాతం తోటల్లో కాపు తగ్గిపోయింది. చిత్తూరు జిల్లాలోనూ మామిడి పూత సమయానికి రాలేదు. ఒక చెట్టుకే పెద్ద కాయలతోపాటు పూతలు, పిందెలు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. దిగుబడులు కూడా 25 నుంచి 30% శాతానికే పరిమితం అవుతాయని రైతులు వివరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh Pant : సూపర్ రిషభ్.. నువ్వొక ఎంటర్టైన్ క్రికెటర్‌వి
-
Politics News
Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
-
Politics News
Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!
-
Business News
Billionaires: కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి
-
Sports News
MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?
-
Politics News
Telangana News: నేడు హైదరాబాద్‌కు సిన్హా.. నగరంలో తెరాస భారీ ర్యాలీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!