AP news: కృష్ణానదిలో ఇసుక పడవలతో భారీ ర్యాలీ

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ కృష్ణా నదిలో ఇసుకను తరలించే పడవలతో వాటి యజమానులు, కార్మికులు బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 13 Jun 2024 04:43 IST

చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ కృష్ణానదిలో ఇసుక పడవల యజమానుల సంఘం నిర్వహించిన పడవల ర్యాలీ

తాడేపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ కృష్ణా నదిలో ఇసుకను తరలించే పడవలతో వాటి యజమానులు, కార్మికులు బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. పడవలకు తెదేపా, జనసేన జెండాలను కట్టి వెంకటపాలెం ర్యాంపు వద్ద నుంచి భారీ ర్యాలీని ప్రారంభించారు. ఉండవల్లి ఇసుక ర్యాంపు మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకు ఇది సాగింది. ఉదయం 8గంటల నుంచి దాదాపు 30 ఇసుక పడవలతోపాటు మరో 70 మత్స్యకార పడవలతో అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక పడవలకు పనిలేకపోవడం వల్ల వాటి యజమానులు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారని, వారితోపాటు ఇసుక కార్మికులు కూడా పని కోల్పోయారని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని