Janasena: జనసేనకు కీలక శాఖలు

మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.

Updated : 13 Jun 2024 13:30 IST

పవన్‌ కల్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు
నేడు ప్రకటించనున్న చంద్రబాబు

ఈనాడు, అమరావతి: మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్‌ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలిసింది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని