Indian Airforce:వైమానిక దళ ప్రతి అడుగూ దేశ రక్షణకే

వైమానిక దళం వేసే ప్రతి అడుగు దేశ రక్షణ కోసమేనని దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ అధిపతి కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ జె.చలపతి పేర్కొన్నారు. తిరువనంతపురంలో దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ అధిపతిగా అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన....

Updated : 25 Dec 2021 04:51 IST

బాపట్ల, న్యూస్‌టుడే: వైమానిక దళం వేసే ప్రతి అడుగు దేశ రక్షణ కోసమేనని దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ అధిపతి కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ జె.చలపతి పేర్కొన్నారు. తిరువనంతపురంలో దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ అధిపతిగా అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా శుక్రవారం సూర్యలంకలోని వాయుసేన కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం కమాండెంట్, గ్రూప్‌ కెప్టెన్‌ ఆర్‌ఎస్‌ చౌదరి, అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ.. గైడెడ్‌ క్షిపణుల పరీక్షలు విజయవంతంగా నిర్వహించటం ద్వారా భారత వైమానిక దళ సామర్థ్యం ప్రపంచానికి తెలియజేయాలన్నారు. త్వరలో నిర్వహించనున్న క్షిపణుల పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాయుసేన కేంద్రంలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు పరిశీలించారు. తూర్పు తీరంలో సూర్యలంక కీలకమైన వైమానిక దళ కేంద్రంగా ఎదిగిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని