- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
JEE Main 2022: 3 రోజుల్లో జేఈఈ మెయిన్.. హాల్టికెట్లేవి?
ఈనాడు, హైదరాబాద్: ప్రవేశ పరీక్షలకు వారం పది రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేయడం ఆనవాయితీ. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అయినా ఆదివారం రాత్రి 7.30 వరకు ఈ సంస్థ హాల్‌టికెట్లు జారీ చేయలేదు. మూడు రోజుల క్రితం విద్యార్థులకు ఏ నగరం కేటాయించారో వెల్లడించినా.. పరీక్షా కేంద్రం ఏదన్నది ఇంకా తెలపలేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఈ పరీక్ష రాయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను నెలకొల్పిన నాటి నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాల వెల్లడిలో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా కొన్ని నెలల క్రితం జేఈఈ మెయిన్ తేదీలను ప్రకటించిన ఈ సంస్థ.. తర్వాత కొత్త కాలపట్టికను ప్రకటించి విమర్శల పాలైంది. ఆ సంస్థ తీరుతో.. జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించే ఐఐటీలు కూడా పరీక్షల తేదీలను మార్చాల్చి వచ్చింది.జూన్ 21 నుంచి జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు మొదలవుతాయని గతంలో ప్రకటించిన ఎన్టీఏ.. మూడు రోజుల క్రితం ఈ నెల 23 నుంచని వెల్లడించింది. పక్కా ప్రణాళిక లేకపోవడం, రాష్ట్రాలను సంప్రదించకపోవడమే తప్పిదాలకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడ్వాన్స్డ్ నిర్వహించే ఐఐటీలు.. పరీక్ష ఫలితాల వెల్లడి తేదీని ముందుగానే ప్రకటిస్తున్నాయి. ఎన్టీఏ మాత్రం ఫలితాల వెల్లడి విషయాన్ని కనీసం కొద్ది గంటల ముందుగా కూడా అధికారికంగా ప్రకటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఆ గాయం మళ్లీ గుచ్చుతోంది.. న్యాయానికి ముగింపు ఇలానా..?
-
General News
Appendicitis: అపెండిసైటీస్ రాకుండా ఇలా చేయొచ్చు..!
-
India News
Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
-
Politics News
Jadcherla: జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చ.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌పై అనిరుధ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు
-
Movies News
Karan Johar: కత్రినా పెళ్లి.. ఆలియా నేనూ మందు తాగి విక్కీకి ఫోన్ చేశాం: కరణ్ జోహార్
-
Politics News
భాజపా కుట్రలో పావులౌతున్నారు.. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?