JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ విడుదల

జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షల సిలబస్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated : 21 Dec 2022 07:12 IST

ఈనాడు, అమరావతి: జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షల సిలబస్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌ పేపర్‌లో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం మూడు విభాగాలు ఉంటాయి. జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 ఇంజినీరింగ్‌(బీఈ, బీటెక్‌) ప్రోగాంల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. పేపర్‌-2తో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రెండు విడతలుగా ఉంటుంది. బహుళ ఐచ్ఛిక విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పుడు సమాధానానికి మైనస్‌ మార్కులు ఉంటాయి. మెయిన్స్‌ను ఆంగ్లం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని