Payyavula Keshav: సభలో స్వపక్షమైనా.. విపక్షమైనా మేమే

సభలో స్వపక్షమైనా, విపక్షమైనా తామేనని, ప్రజల కోసం ఏ పాత్ర పోషించేందుకైనా సిద్ధంగా ఉంటామని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Updated : 20 Jun 2024 06:25 IST

అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నా
బాధ్యతలు చేపట్టిన శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌

ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పయ్యావుల కేశవ్‌. చిత్రంలో శాసనసభ కార్యదర్శి రామాచార్యులు

ఈనాడు, అమరావతి: సభలో స్వపక్షమైనా, విపక్షమైనా తామేనని, ప్రజల కోసం ఏ పాత్ర పోషించేందుకైనా సిద్ధంగా ఉంటామని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి దోహదపడేలా అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు టీడీఎల్పీలో దివంగత సీఎం ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. శాసనసభ కార్యదర్శి రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి రాజకుమార్‌ తదితరులు మంత్రి కేశవ్‌కు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని