Free Sand: ఇసుక కోసం లారీల బారులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద ఇసుక కోసం లారీలు బారులు తీరుతున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర లారీలు ఒకదాని వెంట మరొకటి వరస క్రమంలో నిలిచాయి.

Published : 10 Jul 2024 07:32 IST

గుండిమెడ వద్ద నిల్వ కేంద్రంలో లారీల్లో ఇసుక లోడింగ్‌ 

తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద ఇసుక కోసం లారీలు బారులు తీరుతున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర లారీలు ఒకదాని వెంట మరొకటి వరస క్రమంలో నిలిచాయి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి లారీలు తరలివచ్చాయి. డ్రైవర్లు రెండు రోజులుగా తమ వాహనాలను కరకట్టపై వరుసలో నిలిపారు. ఇక్కడ నిల్వ చేసిన 20 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక విక్రయాలను మంగళవారం ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఇసుక కోసం డ్రైవర్లు వరసలో నిలబడి ఆధార్‌ కార్డు చూపి మొత్తంగా 2,482 మెట్రిక్‌ టన్నుల ఇసుక తీసుకున్నారు. 

ఇసుక కోసం బారులు

ఇసుక కోసం కిలోమీటరున్నర మేర లారీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని