Minister Narayana: రెండున్నరేళ్లలో అమరావతి పూర్తయ్యేలా చూస్తాం

 రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని... వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Updated : 15 Jun 2024 06:28 IST

ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ వేస్తాం
పది రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత ఇస్తాం
పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ

ఈనాడు డిజిటల్, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని... వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని, ఆ నివేదిక రావడానికి రెండు, మూడు నెలలు పడుతుందని తెలిపారు. ‘‘రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంతో నాకు అనుబంధం ఉంది. 34 వేల ఎకరాల్ని కేవలం 58 రోజుల్లో రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారు. రూ.9వేల కోట్లు ఖర్చుపెట్టి రహదారుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించాం. ఐఏఎస్‌లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాలుగో తరగతి ఉద్యోగుల వసతి భవనాలు... గత తెదేపా ప్రభుత్వంలోనే 70-90% పూర్తయ్యాయి. అభివృద్ధి పనుల్ని వైకాపా ప్రభుత్వం కొనసాగిస్తే అమరావతి పూర్తయ్యేది. రీ టెండర్లు పిలవడమా.. ఉన్నవారిని కొనసాగించడమా అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆరేడు నెలల్లో వసతిభవనాల్ని పూర్తిచేస్తాం. అమరావతి పనుల ప్రారంభంపై పదిరోజుల్లో స్పష్టత రానుంది’’ అని నారాయణ తెలిపారు. 

త్వరలోనే చెత్త పన్ను రద్దు

‘‘సీఎం చంద్రబాబుతో మాట్లాడి త్వరలోనే చెత్తపన్ను రద్దుపై నిర్ణయం తీసుకుంటాం. 2014లో నేను నిర్వహించిన శాఖల్నే మళ్లీ నాకు ఇచ్చారు. అందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు’’ అని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు