TTD: 12వేలకు మించితే తిరుమలకు అనుమతి లేదు: తితిదే

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారనే ఆలోచనతో తితిదే నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు

Updated : 23 Sep 2022 10:38 IST

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారనే ఆలోచనతో తితిదే నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు 12వేలు దాటిన తరువాత అనుమతించకూడదని నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్‌ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని సూచించింది. ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఈ ఏడాది గరుడ సేవ 1వ తేదీ కాగా.. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని