Mudragada: ఇక.. ముద్రగడ పద్మనాభరెడ్డి.. పేరు మార్చుకున్న కాపు ఉద్యమ నేత

వైకాపా నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారింది. పేరు మార్పుపై బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్‌ విసిరారు.

Updated : 21 Jun 2024 05:49 IST

ఈనాడు, కాకినాడ: వైకాపా నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారింది. పేరు మార్పుపై బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్‌ విసిరారు. పవన్‌ భారీ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రితోపాటు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫలితాలు వెలువడిన మరుసటిరోజే మీడియా ఎదుట ముద్రగడ తన ఓటమిని అంగీకరించి పేరు మార్పు కోసం దరఖాస్తు పెట్టుకుంటానని వెల్లడించారు. ఆయన దరఖాస్తు చేసుకున్నందున పద్మనాభం పేరును పద్మనాభరెడ్డిగా మారుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అయితే కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పేరు చివర్లో ‘రెడ్డి’ అని జోడించుకోవడంపై చర్చ నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని