Bhuvaneshwari: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది

గౌరవసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుపెట్టారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం’ అని ‘ఎక్స్‌’లో శుక్రవారం ఆమె పోస్ట్‌ చేశారు.

Updated : 22 Jun 2024 05:30 IST

‘ఎక్స్‌’లో నారా భువనేశ్వరి పోస్ట్‌ 

శాసనసభలో చంద్రబాబు ప్రమాణం చేస్తున్న కార్యక్రమాన్ని ఉండవల్లిలోని నివాసంలో టీవీలో వీక్షిస్తున్న భువనేశ్వరి

ఈనాడు డిజిటల్, అమరావతి: గౌరవసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుపెట్టారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం’ అని ‘ఎక్స్‌’లో శుక్రవారం ఆమె పోస్ట్‌ చేశారు. శాసనసభలో చంద్రబాబు సహా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తన నివాసం నుంచి టీవీలో ఆమె వీక్షించారు. గతంలో వైకాపా ఎమ్మెల్యేలు అవమానించినప్పుడు ‘‘ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తాను. ఇదో కౌరవసభ. గౌరవసభ కాదు. ఇలాంటి కౌరవసభలో నేనుండను’’ అంటూ అసెంబ్లీని వీడుతూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యల్ని భువనేశ్వరి గుర్తుచేశారు. మళ్లీ సీఎంగా సభలోకి చంద్రబాబు ప్రవేశించడం, ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. 

తండ్రితో కలిసి సభలో కూర్చునే అదృష్టం లోకేశ్‌ స్వయంకృషే 

తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గౌరవసభలో కూర్చొనే అదృష్టం లోకేశ్‌కు రావడం.. ఆయన స్వయంకృషేనని లోకేశ్‌ తల్లి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. లోకేశ్‌ను చూస్తే గర్వంగా, సంతోషంగా ఉందని ‘ఎక్స్‌’లో శుక్రవారం ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని