Nara Brahmani: వ్యక్తిత్వహననం చేసిన వారికి నువ్వేంటో తెలియజేశావు: లోకేశ్‌పై నారా బ్రాహ్మణి పోస్ట్‌

అంతా పల్లెల నుంచి అమెరికా వెళ్తే, అక్కడ చదివిన లోకేశ్‌ పల్లె గడపల వద్దకు వచ్చారని.. సిమెంట్‌ రోడ్లతో, ఎల్‌ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కొనియాడారు.

Updated : 25 Jun 2024 07:04 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: అంతా పల్లెల నుంచి అమెరికా వెళ్తే, అక్కడ చదివిన లోకేశ్‌ పల్లె గడపల వద్దకు వచ్చారని.. సిమెంట్‌ రోడ్లతో, ఎల్‌ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కొనియాడారు. విద్యా, ఐటీశాఖ మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆమె ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పనిలో పడి విమర్శల్ని పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నిన్ను వ్యక్తిత్వహననం చేసిన వారికి నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు. కుటుంబపరంగా నీకు మా సహకారం ఉంటుంది’ అని బ్రాహ్మణి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని