Nara Lokesh: సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్‌

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ప్రజాదర్బార్‌’కు శ్రీకారం చుట్టారు.

Published : 16 Jun 2024 04:41 IST

మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేశ్‌ భరోసా

ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌కు సమస్య వివరిస్తున్న మహిళ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ప్రజాదర్బార్‌’కు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి తోటి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వందల మంది ప్రజలు వచ్చి వారి సమస్యలను నేరుగా లోకేశ్‌కు తెలియజేశారు.  వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సొంత నిధులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల మనస్సు గెలుచుకున్న లోకేశ్‌ ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మినహా మిగిలిన రోజుల్లో నిత్యం ఉదయం 8 గంటలకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాదర్బార్‌ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని