Andhra News: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు కొరవడిన స్పందన.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు స్పందన కొరవడటంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్లాట్‌లో 60% భూమి విలువపైనే

Updated : 24 Sep 2022 08:17 IST

ఈనాడు, అమరావతి: పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు స్పందన కొరవడటంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్లాట్‌లో 60% భూమి విలువపైనే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు సంబంధించిన కొన్ని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో కొనుగోలుదారులను ఆకర్షించడానికి తీసుకున్న తాజా నిర్ణయాన్ని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకూ వర్తింపజేసింది. ఈ ప్రకారం...ప్లాట్‌ మొత్తం విస్తీర్ణాన్ని రెండుగా విభజించనున్నారు. ఇందులో 60% ప్రాంతాన్ని అమ్మకపు ధరగా నిర్ణయిస్తారు. మిగతా 40% ప్రాంతాన్ని అభివృద్ధి ధరగా చూపిస్తారు. 60% అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాలి. 40% అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఉండవు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఎంఐజీ ప్లాట్ల ధరను ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించినందున...వాటి విస్తీర్ణాన్ని రెండుగా విభజించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ధి సంస్థలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని