Pawan Kalyan: రాష్ట్ర పునర్‌ వైభవానికి తొలి అడుగులు పడ్డాయ్‌: మంత్రి పవన్‌ కల్యాణ్‌

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే పాలన సాగుతుందని మంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రానికి పునర్‌ వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని గురువారం ఎక్స్‌లో పేర్కొన్నారు.

Published : 14 Jun 2024 03:52 IST

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే పాలన సాగుతుందని మంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రానికి పునర్‌ వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని గురువారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఎన్డీయే ఇచ్చిన హామీల అమలు మొదలైంది. మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, సామాజిక పింఛన్లు రూ.4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్‌ సెన్సస్‌ ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు’ అని పోస్ట్‌లో వెల్లడించారు.

పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దు: ప్రమాణస్వీకారం తర్వాత తననూ కలవడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.‘మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాకు అభినందనలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఈ నెల 20 తర్వాత కలుస్తా. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తా. ఇందుకు సంబంధించిన షెడ్యూలును వెల్లడిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని