Andhra News: దస్త్రాల దహనం కేసు దర్యాప్తు వేగవంతం

పీసీబీ దస్త్రాల దహనం ఘటనపై పెనమలూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారి రామారావు నేతృత్వంలోని బృందం బుధవారం విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది.

Published : 11 Jul 2024 03:38 IST

పీసీబీ కార్యాలయంలో పోలీసుల విచారణ 

కాపలా సిబ్బందిని ప్రశ్నిస్తున్న పోలీసులు

ఈనాడు, అమరావతి: పీసీబీ దస్త్రాల దహనం ఘటనపై పెనమలూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారి రామారావు నేతృత్వంలోని బృందం బుధవారం విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇటీవల కృష్ణానది కరకట్టపై దహనం అవుతున్న దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిని పీసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి.. అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు రాబట్టారు. కార్యాలయం కాపలా సిబ్బందిని ప్రశ్నించారు. ఆఫీసు నుంచి దస్త్రాలు తీసుకెళ్లిన సంగతి మీకు తెలుసా? వాహనాల రాకపోకలను రిజిస్టర్‌లో నమోదుచేస్తారా? అని ప్రశ్నించారు. తాము కార్ల నంబర్లను నమోదుచేస్తామని, వాటిని తనిఖీచేసే అధికారం తమకు లేదని కాపలా సిబ్బంది సమాధానం ఇచ్చారు. కరకట్టపై కాగితాలు తగలబెట్టిన రోజు కార్యాలయం నుంచే కారు వెళ్లిందా? వివరాలు నమోదు చేశారా? అని పోలీసులు ఆరాతీశారు.     ఆ సమాచారం లేదని వివరించారు. పోలీసులు తెచ్చిన దస్త్రాలను పీసీబీ కార్యాలయంలోని సంబంధిత విభాగం సిబ్బందికి చూపించి.. వాటిని ఎవరు తయారుచేశారు? రహస్యమైనవా.. సాధారణమైనవా? ఆ దస్త్రాలు ఎలా బయటకు వెళ్లాయి? అనే వివరాలను సేకరించారు. ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారు. 

అందుబాటులో లేని రామారావు 

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్‌శర్మ వద్ద ఓఎస్డీ రామారావు ఇంటికి పోలీసులు బుధవారం వెళ్లారు. ఆయన అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌ వెళ్లినట్లు తెలిసింది. ఆయన ఇంట్లో పీసీబీ ఫైళ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, విజయవాడ వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని పోలీసులతో రామారావు చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు