Guntur: మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు.. ఎమ్మెల్యే మాధవి ఎదుట మహిళల కన్నీళ్లు

‘మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. గత ఐదేళ్లలో ఎక్కడంటే అక్కడ దొరకడం వల్ల గంజాయికి అలవాటు పడి ఆసుపత్రుల పాలయ్యారు.

Updated : 10 Jul 2024 09:05 IST

తమ పిల్లలు గంజాయికి బానిసలయ్యారని విలపిస్తూ ఎమ్మెల్యే గళ్లా మాధవికి చెబుతున్న మహిళలు

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: ‘మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. గత ఐదేళ్లలో ఎక్కడంటే అక్కడ దొరకడం వల్ల గంజాయికి అలవాటు పడి ఆసుపత్రుల పాలయ్యారు. గంజాయి దొరక్కుండా చేసి మా పిల్లల్ని కాపాడండి’.. అని గుంటూరు నల్లచెరువు మహిళలు ఎమ్మెల్యే గళ్లా మాధవి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. గుంటూరులోని 19వ డివిజన్‌లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు కొందరు మహిళలు తమ గోడు వినిపించారు. తమ పిల్లలు గంజాయి బారిన పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి గంజాయిని అరికడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని