Pinnelli: పోలీసు కస్టడీకి పిన్నెల్లి

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎస్‌.శ్రీనివాస కల్యాణ్‌ శుక్రవారం తీర్పునిచ్చారు.

Published : 06 Jul 2024 04:58 IST

మాచర్ల(కారంపూడి), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎస్‌.శ్రీనివాస కల్యాణ్‌ శుక్రవారం తీర్పునిచ్చారు. పిన్నెల్లి నుంచి అదనపు సమాచారం రాబట్టేందుకు నాలుగు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా.. కేవలం రెండు రోజుల పాటు మాత్రమే కస్టడీకి అనుమతించింది. ఈ నెల 8, 9 తేదీల్లో నెల్లూరు కేంద్ర కారాగారంలో, వెబ్‌కాస్టింగ్‌తో విచారణ చేపట్టాలని కోర్టు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు