Andhra News: ఏపీలో ఫ్లైయాష్‌తో గుంతల పూడ్చివేత.. వివిధ రూపాల్లో రోడ్ల మరమ్మతు

రహదారుల గుంతలను తక్కువ ఖర్చుతో మరమ్మతు చేసేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం థర్మల్‌ కేంద్రాల్లో లభించే ఫ్లైయాష్‌ వాడకంపై దృష్టి పెట్టాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించిన మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.

Updated : 10 Jul 2024 06:53 IST

ఎన్టీఆర్‌ జిల్లా నున్న బైపాస్‌లో ఫ్లైయాష్, కంకర, సిమెంటుతో పూడ్చిన రహదారి గుంత

ఈనాడు, అమరావతి: రహదారుల గుంతలను తక్కువ ఖర్చుతో మరమ్మతు చేసేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం థర్మల్‌ కేంద్రాల్లో లభించే ఫ్లైయాష్‌ వాడకంపై దృష్టి పెట్టాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించిన మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో ఫ్లైయాష్‌తో రోడ్లకు మరమ్మతు చేసి ఎంతవరకు మన్నుతున్నాయనేది పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నున్న బైపాస్‌లోనూ, వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో ఓ రహదారిలో రెండేసి కి.మీ. మేర గుంతలు పూడ్చారు. ఫ్లైయాష్‌తో నీరు కలిపి గుంతలు పూడ్చటం, ఫ్లైయాష్, కంకర కలిపి గుంతలు పూడ్చటం, ఫ్లైయాష్, కంకర, సిమెంట్‌తో గుంతలు పూడ్చటం వంటి మూడు ప్రయత్నాలు చేశారు. ఇందులో ఫ్లైయాష్, కంకర, సిమెంట్‌ మిక్సింగ్‌తో పూడ్చిన గుంతలు కొంతవరకు పటిష్ఠంగా ఉన్నట్లు గుర్తించారు. తక్కువ ఖర్చుతో గుంతలు ఎలా పూడ్చవచ్చనే అంశంపై అధ్యయనానికి విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుంటున్నారు. ఈ విషయంలో సహకరించేందుకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, తిరుపతి ఐఐటీలు ముందుకొచ్చాయి. త్వరలో ఇంజినీర్లతో చర్చించి వారు ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. రహదారులపై సీఎం చంద్రబాబు త్వరలో సమీక్షించే నాటికి ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు