Dwaraka Tirumala: కాలం చెల్లిన పాలతో జ్యూస్‌ తయారీ.. ద్వారకా తిరుమలలో దుకాణదారుడి నిర్వాకం

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి శేషాచలంపై ఉన్న కొందరు జ్యూస్‌ దుకాణాల వ్యాపారులు కాలం చెల్లిన ప్యాకెట్ల పాలతో పండ్ల రసాలు చేసి విక్రయిస్తున్నారు.

Updated : 11 Jul 2024 09:15 IST


జ్యూస్‌ స్టాల్‌లో తనిఖీ చేస్తున్న అధికారులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి శేషాచలంపై ఉన్న కొందరు జ్యూస్‌ దుకాణాల వ్యాపారులు కాలం చెల్లిన ప్యాకెట్ల పాలతో పండ్ల రసాలు చేసి విక్రయిస్తున్నారు. చిన వెంకన్న దర్శనం కోసం బుధవారం క్షేత్రానికి వచ్చిన ఓ భక్తుడు జ్యూస్‌ తాగేందుకు శ్రీలక్ష్మీ దుర్గా బాలాజీ పేరుతో ఉన్న జ్యూస్‌ దుకాణానికి వెళ్లారు.  నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్యాకెట్ల పాలను ఉపయోగించి జ్యూస్‌ చేసి ఇచ్చాడు. ఆ పాల ప్యాకెట్లు కాలం చెల్లినవిగా గుర్తించిన భక్తుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు తనిఖీలు చేసి, సుమారు 217 పాల ప్యాకెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని, దుకాణాన్ని సీజ్‌ చేసినట్లు సూపరింటెండెంట్‌ నరసింహరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని