AP Govt: ఏపీలో నేటి నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ప్రారంభం

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్‌ పోర్టల్‌ను సోమవారం ఉదయం 9 గంటలనుంచి ప్రారంభిస్తోంది.

Updated : 24 Jun 2024 07:14 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్‌సైట్‌

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్‌ పోర్టల్‌ను సోమవారం ఉదయం 9 గంటలనుంచి ప్రారంభిస్తోంది. జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లలో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్‌ నంబరు ఇవ్వాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు. దాని ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని