YS Jagan: తాడేపల్లిలో ప్రజలకు తీరిన ‘దారి’ కష్టాలు!

తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు.

Updated : 17 Jun 2024 07:35 IST

మాజీ సీఎం జగన్‌ నివాసం వెనుక మార్గం నుంచి అనుమతులు

జగన్‌ నివాసం వెనుక రోడ్డులో తొలగించిన బారికేడ్లు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు. ఆయా మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు 1.5 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వచ్చేది. ఆయా ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లు తొలగింపజేసింది. రహదారికి రెండు వైపులా పోలీసు చెక్‌పోస్టులు ఉంచి.. ప్రజల రాకపోకలకు ఆదివారం రాత్రి నుంచి అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని