Andhra News: 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు వారికి వర్తించదు.. సవివరంగా ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం

Updated : 24 Sep 2022 07:09 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేస్తూ ఆయా సంస్థలు ఉత్తర్వులు ఇవ్వడం తగదని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థల్లో పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆర్థికశాఖ, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు ఇందుకు సంబంధించి నివేదికను పంపాలని కూడా ఆయా సంస్థలకు నిర్దేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని