Nadendla Manohar: 11 నుంచి రైతు బజార్లలో కందిపప్పు రూ.160కే: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో రూ.160 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సోమవారం ఆయన విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో టోకు వర్తకులు,

Updated : 09 Jul 2024 06:46 IST

ధరల స్థిరీకరణపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మనోహర్, అధికారులు సిద్దార్థజైన్, వీరపాండియన్‌ 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో రూ.160 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సోమవారం ఆయన విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో టోకు వర్తకులు, రైస్‌మిల్లర్లు, సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్, ఎండీ వీరపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని