Updated : 02 Jul 2022 08:44 IST

Andhra News: ఎన్నికైనప్పటి నుంచి సచివాలయంలో కూర్చోనివ్వలేదు.. సర్పంచి నిరసన

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది, అధికారులు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారని పేర్కొంటూ అనంతపురం జిల్లా గుమ్మఘట్ట సర్పంచి విజయలక్ష్మి(తెదేపా మద్దతుదారు) నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామ సచివాలయం ఆరుబయటే ఉన్నారు. సర్పంచిగా ఎన్నికైనప్పటి నుంచి నేటివరకు సచివాలయంలో కూర్చోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలను తెలుసుకునేందుకు ప్రయత్నించినా కనీస సమాచారం కూడా సంబంధిత ఉద్యోగులు తెలపడం లేదన్నారు. బీసీ సర్పంచిపై మండల అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా పంచాయతీ అధికారి,  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts