Suman Bose: ‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్‌ మాజీ ఎండీ!

‘కర్మ’ఫలం ఇది.. అని సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ గత వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలుస్తుంది.. అని నేను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Published : 17 Jun 2024 06:06 IST

ఈనాడు, అమరావతి: ‘కర్మ’ఫలం ఇది.. అని సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ గత వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలుస్తుంది.. అని నేను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు. సీమెన్స్‌ ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణిలు చేసిన పోస్ట్‌లను ట్యాగ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని