Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి

మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడిఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేసిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకొంది.

Published : 17 Jun 2024 05:58 IST

రాళ్లు విసురుతున్న యువకులను అడ్డుకుంటున్న పోలీసు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేసిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. స్థానిక ఫెర్రీ నుంచి రింగుకూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. ఇది గమనించి పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులూ రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. ఇప్పటికే జోగి రమేష్‌ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తిస్తున్నామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని