AP News: ఎక్కడున్నావ్‌... జగనన్నా!

‘నా భర్త ఆరు రోజుల కిందట వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆచూకీ కోసం వెతకని ప్రదేశం లేదు. కానీ.. జాడ కనిపించలేదు. ప్రభుత్వ యంత్రాంగమూ ఆచూకీ కనిపెట్టలేకపోతోంది. వరదలతో ఊర్లు వల్లకాడవుతున్నా

Updated : 25 Nov 2021 09:42 IST

 వరదలో ఆరు రోజుల కిందట భర్త గల్లంతు

ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన

గల్లంతైన భర్త రషీద్‌ ఫొటో చూపిస్తూ రోదిస్తున్న ఆయేషా

ఈటీవీ, కడప: ‘నా భర్త ఆరు రోజుల కిందట వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆచూకీ కోసం వెతకని ప్రదేశం లేదు. కానీ.. జాడ కనిపించలేదు. ప్రభుత్వ యంత్రాంగమూ ఆచూకీ కనిపెట్టలేకపోతోంది. వరదలతో ఊర్లు వల్లకాడవుతున్నా పట్టించుకోకుండా ఎక్కడున్నావ్‌ జగనన్నా...? ఇక్కడికి వచ్చి మా కష్టాలు చూడన్నా...’ అంటూ కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన అయేషా కన్నీటి పర్యంతం అయ్యారు. బుధవారం సాయంత్రం ఆమె తన గోడును ‘ఈటీవీ’ ముందు వెల్లబోసుకున్నారు. ఈనెల 19న అన్నమయ్య జలాశయం కట్ట తెగడంతో చెయ్యేరు నది గుండ్లూరు, పులపుత్తూరు, మందపల్లె, తోగూరుపేట గ్రామాలను ముంచేసింది. గుండ్లూరుకు చెందిన రషీద్‌ బంధువులు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయారు. నాటి నుంచి ఆయన భార్య ఆయేషా ఊళ్లన్నీ తిరిగారు. ఏమయ్యాడో తెలియక ఆమెలో నిరాశ ఆవరించింది. ఆ ఆవేదన ఆక్రోశంగా మారడంతో బుధవారం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే... తన భర్త ఆచూకీని కనిపెట్టాలని వేడుకున్నారు. రషీద్‌, ఆయేషా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని