TG Bharath: రాష్ట్రానికి ‘గిఫ్ట్‌’ సిటీ తెచ్చేందుకు ప్రయత్నిస్తాం: మంత్రి టి.జి. భరత్‌

పెట్టుబడుల ఆకర్షణ కోసం గుజరాత్‌ తరహాలో రాష్ట్రంలో గిఫ్ట్‌ సిటీ(గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీ)ని అభివృద్ధి చేసే ప్రతిపాదనపై ప్రధానంగా దృష్టి పెడతామని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్‌ తెలిపారు.

Updated : 21 Jun 2024 07:43 IST

టీజీ భరత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఆయన  భార్య టీజీ శిల్ప 

ఈనాడు, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ కోసం గుజరాత్‌ తరహాలో రాష్ట్రంలో గిఫ్ట్‌ సిటీ(గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీ)ని అభివృద్ధి చేసే ప్రతిపాదనపై ప్రధానంగా దృష్టి పెడతామని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్‌ తెలిపారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎప్‌ఎస్‌సీ) అందుబాటులోకి వస్తుందన్నారు. గురువారం బాధత్యల స్వీకారం అనంతరం మాట్లాడుతూ... ‘గిఫ్ట్‌ సిటీలో పెట్టుబడులు పెట్టే దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు అనేక పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. ఐఎఫ్‌ఎస్‌సీ సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలకూ పలు ప్రయోజనాలు లభిస్తాయి. గత ఐదేళ్లలో పెట్టుబడిదారుల్లో రాష్ట్రం పట్ల ప్రతికూలత ఏర్పడింది. దీన్ని పోగొట్టడంపై తక్షణం దృష్టి పెడతాం’ అని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని