Andhra News: కుంగిపోయిన మూడంతస్తుల భవనం.. కడపలో అర్ధరాత్రి ఘటన

వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరం కో-ఆపరేటివ్‌ కాలనీలోని విద్యామందిర్‌ పాఠశాల సమీపంలో ఓ మూడంతస్తుల భవనం బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కుంగిపోయింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా

Updated : 23 Sep 2022 08:32 IST

తప్పిన ప్రాణాపాయం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరం కో-ఆపరేటివ్‌ కాలనీలోని విద్యామందిర్‌ పాఠశాల సమీపంలో ఓ మూడంతస్తుల భవనం బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కుంగిపోయింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భవనం పాతది కావడంతో  యజయాని వెంకటరామరాజు..  గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దెకు  ఉంటున్న వారిని ఇటీవల ఖాళీ చేయించి మరమ్మతులు చేయిస్తున్నారు. మొదటి అంతస్తులో సుబ్బరాయుడు, స్వప్న దంపతులు వారి ముగ్గురు పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నారు. రెండో అంతస్తులో సుదర్శన్‌రాజు, మౌనిక దంపతులు వారిద్దరి పిల్లలతో కలిసి ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అకస్మాత్తుగా శబ్దాలు వినిపించడంతో రెండో అంతస్తులో ఉన్న వారు బయటికి వచ్చి చూశారు. అప్పటికే భవనం కుంగిపోవడంతో బయటికి వచ్చేశారు. తలుపులు తెరుచుకోకపోవడంతో మొదటి అంతస్తులో ఉన్న వారు లోపలే ఉండిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారమివ్వడంతో కిటికీల ఊచలు తొలగించి వారిని కాపాడారు. మరమ్మతుల కోసం డ్రిల్లింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు