Palnadu: పల్నాట పులి.. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు..

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించింది.

Updated : 10 Jul 2024 07:51 IST

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించింది. బొటుకులపాయ బేస్‌క్యాంపు వద్ద ఏర్పాటుచేసిన సాసర్‌పిట్‌లో పులి సంచరించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడంతో జంతువులు సాసర్‌పిట్‌ల వద్దకు వస్తున్నాయని విజయపురిసౌత్‌ రేంజర్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. నాలుగు రోజుల కిందట బొటుకులపాయ బేస్‌క్యాంపులో పులి సంచరించిన చిత్రాలు కెమెరాలో రికార్డు అయినట్లు ఆయన ధ్రువీకరించారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఉంటుందని తెలిపారు.       

 న్యూస్‌టుడే, వెల్దుర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు