Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో.. దివ్యదర్శన టోకెన్ల స్కానింగ్‌ పునఃప్రారంభం

శ్రీవారి మెట్టు మార్గంలోని 1,200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్‌ను తితిదే పునఃప్రారంభించింది. దీని ట్రయల్‌ రన్‌ గురువారం చేపట్టింది.

Updated : 21 Jun 2024 06:53 IST

భక్తురాలి ముఖాన్ని కంప్యూటర్‌లో స్కాన్‌ చేస్తున్నారిలా..

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి మెట్టు మార్గంలోని 1,200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్‌ను తితిదే పునఃప్రారంభించింది. దీని ట్రయల్‌ రన్‌ గురువారం చేపట్టింది. శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా 1,200వ మెట్టు వద్ద స్కానింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నిర్దేశిత టైమ్‌స్లాట్‌తో దివ్యదర్శన క్యూలైన్లలోకి అనుమతించరు. ఈ మార్పునకు అనుగుణంగా భక్తులు దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని తితిదే సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని