Andhra News: పథకాల పేర్లు పునరుద్ధరణ

వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో కొనసాగిన పేర్లనే తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది.

Published : 19 Jun 2024 06:42 IST

2014-19 మధ్య అమలైన పథకాల పేర్లు మార్చిన వైకాపా ప్రభుత్వం
పాత పేర్లనే పునరుద్ధరిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో కొనసాగిన పేర్లనే తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు పేర్లను మారుస్తూ ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం పేరును పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌(ఆర్‌టీఎఫ్‌)గా, జగనన్న వసతి దీవెనను పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌(ఎమ్‌టీఎఫ్‌)గా, జగనన్న విదేశీ విద్యాదీవెన(ఎస్సీలకు) పథకాన్ని అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధిగా, వైఎస్సార్‌ కల్యాణమస్తును చంద్రన్న పెళ్లికానుకగా, వైఎస్సార్‌ విద్యోన్నతిని ఎన్‌టీఆర్‌ విద్యోన్నతిగా, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక పథకం పేరును సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ప్రోత్సాహక పథకంగా మారుస్తూ ఉత్తర్వులు  జారీ చేశారు. ఈ పథకాలన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైనవే. వాటికే వైకాపా ప్రభుత్వం పేర్లను మార్చింది. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు మినహా మిగతా వాటిని ఎన్నికలు సమీపిస్తుండగా గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు