YS jagan: దావోస్‌లో సీఎం

ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం దావోస్‌ చేరుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, ఏపీఐఐసీ

Updated : 22 May 2022 06:13 IST

నేడు డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం

ఈనాడు, అమరావతి: ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం దావోస్‌ చేరుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ ఆయనకు స్వాగతం పలికారు. సదస్సులో భాగంగా ఆదివారం ఉదయం ప్రపంచ ఆర్థిక  వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్వాప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను సిద్ధం చేయడం, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, సమాచార మార్పిడి, ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు తదితర ఆరు అంశాల్లో డబ్ల్యూఈఎఫ్‌ రాష్ట్రానికి మార్గదర్శనం చేస్తుంది. అనంతరం డబ్ల్యూఈఎఫ్‌ ఆరోగ్య విభాగం అధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌, బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హన్స్‌ పాల్‌బర్కనర్‌తో ఏపీ లాంజ్‌లో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని