ఒక‌టి కంటే ఎక్కువ కార్డుల‌తో ఉండే ప్ర‌యోజ‌నం ఏంటి?

లావాదేవీ తేదీని బట్టి ఈ కాలం 18- 55 రోజుల మధ్య ఉంటుంది

Updated : 12 Jul 2021 12:53 IST


అధికంగా ఖర్చు చేస్తామ‌నో లేదా అప్పుల ఊడిలో ప‌డిపోతామ‌నే భ‌యంతో ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల‌ను తీసుఉనేందుకు ఆలోచిస్తాం. అయితే క్రెడిట్ కార్డ్ ఖర్చులు, తిరిగి చెల్లించడం పట్ల క్రమశిక్షణా విధానాన్ని అనుసరిస్తే ఒక‌టి కంటే ఎక్కువ‌ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం వ‌ల్ల లాభాలు కూడ ఉన్నాయి. 

క్రెడిట్ కార్డుల‌ను ప్ర‌యోజ‌న‌క‌రంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

1. మీ క్రెడిట్ కార్డు వడ్డీ లేకుండా స‌మ‌యానికి చెల్లించే విధంగా చూసుకోవాలి. అనగా క్రెడిట్ కార్డ్ లావాదేవీ తేదీ నుంచి చెల్లింపు గ‌డువులోపు పూర్తిచేయాలి.   ఎటీఎమ్ నగదు ఉపసంహరణలను మినహాయించి క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ ఉండ‌దు. బిల్లు మొత్తాన్ని నిర్ణీత తేదీలో తిరిగి చెల్లిస్తే ఎలాంటి ఆద‌న‌పు భారం ఉండ‌దు.  లావాదేవీ తేదీని బట్టి ఈ కాలం 18 నుంచి 55 రోజుల మధ్య ఉంటుంది. మీకు ఎక్కువ‌ క్రెడిట్ కార్డులు ఉంటే, మిగిలిన వడ్డీ రహిత గ‌డువులో పెద్ద ఖ‌ర్చుల కోసం వినియోగించుకోవ‌చ్చు.
2. క్రెడిట్ కార్డుల‌పై ఇచ్చే రివార్డు పాయింట్ల‌ను ఉప‌యోగించుకోవాలి. క్రెడిట్ కార్డు లావాదేవీల‌పై సంస‌స్థ‌లు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు వంటి ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తాయి. మీరు షాపింగ్, పెట్రోల్‌, ప్రయాణం వంటి వాటి కోసం వేర్వేరు కార్డుల‌తో చెల్లిస్తే ఆయా కార్డుల‌పై వ‌చ్చే వేర్వేరు రివార్డుల‌ను పొంద‌వ‌చ్చు.
3.  మీరు వివిధ క్రెడిట్ కార్డులలో ఈఎంఐ ఎంపికల ఆఫర్లను పోల్చుకోవాలి. క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు కొన్ని వ‌స్తువులు, సేవలపై నో కాస్ట్ ఈఎంఐలను అందిస్తారు. వ్యాపారులు వ‌డ్డీ ర‌హిత‌ ఈఎంఐల‌ ఖర్చులను భరిస్తారు. కార్డుదారులు ఈఎంఐలలో కొనుగోలు ఖర్చును తిరిగి చెల్లించాలి. అయితే, ఈఎంఐ వడ్డీ వ్యయంపై విధించే జీఎస్‌టీని కార్డుదారుడు భరించాలి. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు నో-కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్న తరువాత కార్డుదారులకు అదనపు డిస్కౌంట్‌ను అందిస్తారు.
4. గడువుకు ముందే సేకరించిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయండి. గ‌డువు తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే వోచ‌ర్ల‌ను కొనేందుకు లేదా ఏదైనా వ‌స్తువుల కొనుగోలు స‌మ‌యంలో ఉప‌యోగించాలి. కొన్ని కార్డులకు బిల్లు చెల్లించ‌డానికి రివార్డు పాయింట్ల‌ను కూడా ఉప‌యోగించే సౌల‌భ్యం ఉంటుంది.
 
5. మీరు రిమైండర్‌లను సెట్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ గడువు తేదీలను ట్రాక్ చేయాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు తిరిగి చెల్లించే సదుపాయాలను అందించే వివిధ యాప్‌లు, వాలెట్‌లు కూడా వారి వినియోగదారులకు బిల్ తిరిగి చెల్లించే రిమైండర్‌లను పెట్టుకునే స‌దుపాయం క‌ల్పిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని