2021 Audi e-tron GT: దేశీయ మార్కెట్లోకి ఆడీ ఇ-ట్రోన్‌ ఎలక్ట్రిక్‌ కారు..

దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆడీ ఇ-ట్రోన్‌ ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేశారు. ఈ కారు జీటీ క్వాట్రో వేరియంట్‌  ధర రూ.1.80 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఆర్‌ఎస్‌  జీటీ వేరియంట్‌ ధర రూ.2.05 కోట్లుగా పేర్కొంది.

Published : 22 Sep 2021 23:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆడీ ఇ-ట్రోన్‌ ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేశారు. ఈ కారు జీటీ క్వాట్రో వేరియంట్‌  ధర రూ.1.80 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఆర్‌ఎస్‌  జీటీ వేరియంట్‌ ధర రూ.2.05 కోట్లుగా పేర్కొంది. జర్మనీకి చెందిన ఆడీసంస్థ భారత్‌లో విక్రయిస్తున్న మూడో విద్యుత్తు కారు ఇది. ఇప్పటికే ఇ-ట్రోన్‌ ఎస్‌యూవీ, ఇ-ట్రోన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.  సరికొత్త ఇ-ట్రోన్‌ కారు జర్మనీలోని ఆడీ బొలీంగర్‌హోఫ్‌ కర్మాగారంలో తయారై దిగుమతి అవుతుంది.

తాజాగా విడుదలైన ఇ-ట్రోన్‌ జీటీ కూపే కారులో  స్పోర్ట్స్‌ సిగ్నేచర్‌ ఇ-ట్రోన్‌ పాటర్న్‌ ప్యానల్‌ అమర్చారు. ఈ కారు మొత్తం తొమ్మిది రంగుల్లో అందుబాటులో ఉంది. మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ ఇవ్వగా.. ఆడీ లేజర్‌ లైట్ల ఆప్షన్‌ను అందుబాటులో పెట్టారు. ఈ కారుకు 19 నుంచి 21 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ను ఆప్షన్‌గా ఇచ్చారు. కారు వెనుక ఎండ్‌ టు ఎండ్‌ ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌ను ఇచ్చారు. 

కారు లోపల ఐదు సీట్లు ఉన్నాయి. 12.3 అంగుళాల వర్చువల్‌ కాక్‌పీట్‌ కన్సల్‌, 10.1అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్ప్లేను స్టాండర్డ్‌ వేరియంట్‌గా ఇచ్చారు. ఆడీ కనెక్ట్‌సర్వీసుతో వాయిస్‌ కమాండ్స్ ద్వారా దీనికి కనెక్ట్‌ అవ్యొచ్చు. ఎంఎంఐ నేవిగేషన్‌ ప్లస్‌, వైఫై హాట్‌స్పాట్‌ను వినియోగదార్లకు అందుబాటులోకి తెచ్చారు. జీటీ క్వాట్రోలో అమర్చిన ఇంజిన్‌ 469 బీహెచ్‌ లేదా 350 కిలోవాట్‌శక్తిని విడుదల చేస్తుంది. ఒక సారి ఛార్జి చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక ఆర్‌ఎస్‌ మోడల్‌ 590 బీహెచ్‌పీ శక్తి లేదా 440 కిలోవాట్స్‌ను విడుదల చేస్తుంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 481 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని