Hyundai Tucson: సరికొత్త తరం టక్సన్‌ ఆవిష్కరణ

హ్యుందాయ్‌ సంస్థ సరికొత్త తరం టక్సన్‌ను ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ఆగస్టు 4వ తేదీన మార్కెట్లోకి విడుదల కానుంది.

Updated : 24 Nov 2022 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హ్యుందాయ్‌ సంస్థ కొత్తతరం టక్సన్‌ను ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ఆగస్టు 4వ తేదీన మార్కెట్లోకి విడుదల కానుంది. పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో ఆల్‌వీల్‌ డ్రైవ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లెవల్‌-2 అడ్వాన్డు డ్రైవర్‌ అసిస్టెన్స్‌లు కూడా ఈ కారులో అందుబాటులోకి రానున్నాయి. 

హ్యుందాయ్‌ శైలిలో ఆకర్షణీయమైన డిజైన్‌లో దీనిని తీర్చిదిద్దారు. సరికొత్త పారామెట్రిక్‌ జ్యూవెల్‌ డిజైన్‌ గ్రిల్‌ను ఈ కారుకు అదనపు ఆకర్షణనిచ్చింది. ఎల్‌ షేప్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను అమర్చారు. వీటిని ఆఫ్‌ చేస్తే పూర్తిగా గ్రిల్‌తో కలిసిపోతాయి.  ఇక ప్రధాన హెడ్‌ల్యాంప్‌ను బంపర్‌లోనే అమర్చారు. వెనుకవైపు విండ్‌షీల్డ్‌, టెయిల్‌ ల్యాంప్‌ డిజైన్‌ వంటివి అదనపు హంగులుగా నిలిచాయి. 

మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ కేటగిరిలోకి వచ్చే ఈ కారుకు 18 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ను ఇచ్చారు. ఇక క్యాబిన్‌లో హైసెట్‌ సెంటర్‌ కన్సోల్‌ డ్రైవర్‌, కోడ్రైవర్‌ సీట్లను వేరు చేస్తుంది. స్టీరింగ్‌ వెనుక పూర్తిస్థాయి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ స్క్రీన్‌ను అమర్చారు. దీనిలో నేవిగేషన్‌, పార్కింగ్‌ సెన్సర్‌ ఇన్ఫర్మేషన్‌ వంటివి కూడా కనిపిస్తాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌న్‌లో వివిధ ఫీచర్లను పొందు పర్చారు. డ్యూయల్‌టోన్‌ ఇంటీరియర్‌, బ్లూలింక్‌ కనెక్ట్‌ సహా 60 ఫీచర్లు ఇచ్చారు. ఈ కారుకు 2.0 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లు అమర్చారు. 6స్పీడ్‌ ట్రాన్స్‌ మిషన్‌ అమర్చిన పెట్రోల్‌ ఇంజిన్‌ 154 బీహెచ్‌పీ శక్తిని, 8స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ అమర్చిన డీజిల్‌ ఇంజిన్‌ 184 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని