Published : 26 Jun 2022 21:40 IST

GST: క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28శాతం జీఎస్టీ!

దిల్లీ: క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ (GST) విధించనున్నారు. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్‌ వేదికగా జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సమర్పించిన ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఈ మూడింటికి సంబంధించి మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని కమిటీ దీనికి సంబంధించి సిఫార్సులు చేసింది. కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది ఆర్థిక మంత్రులు ఉన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని