GST: క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ!

క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈనెల 28-29 తేదీల్లో జరగబోయే

Updated : 27 Jun 2022 09:33 IST

దిల్లీ: క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈనెల 28-29 తేదీల్లో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పాల్గొనే ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై జీఎస్‌టీ విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం సిఫారసు చేసింది. గుర్రపు పందేల విషయానికొస్తే.. బుక్‌మేకర్లతో వేసే బెట్‌ల పూర్తి విలువపై జీఎస్‌టీ విధించాలని మంత్రుల బృందం సూచించింది. క్యాసినోలో ఆటగాడు కొనుగోలు చేసే చిప్స్‌/కాయిన్‌ పూర్తి ముఖవిలువపై పన్ను వసూలు చేయాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని