Crypto Tax: క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను..!

క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై మాత్రం 30శాతం పన్ను విధించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Published : 01 Feb 2022 13:41 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

దిల్లీ: ఆదాయ పన్ను మినహాయింపులపై వేతన జీవులకు ఈసారి బడ్జెట్‌లో నిరాశ తప్పలేదు. వ్యక్తిగత ఆదాయపన్ను టారిఫ్‌లపై తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై మాత్రం 30శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా డిజిటల్‌ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30శాతం పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. డిజిటల్‌ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్‌ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు మాత్రం ఉండదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇక బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సాయంతో డిజిటల్‌ రూపీని ఈ ఏడాదే తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని