BUGATTI: బుగాటి.. రూ.34 కోట్ల హైబ్రిడ్‌ హైపర్‌ కార్‌

ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్, తోబియాన్‌ హైపర్‌-జీటీ హైబ్రిడ్‌ కారును ఆవిష్కరించింది. గంటకు 445 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో, ప్రపంచంలోనే రోడ్లపై అత్యంత వేగంగా ప్రయాణించే వాహనంగా ఇది గుర్తింపు పొందనుంది.

Updated : 22 Jun 2024 08:39 IST

గరిష్ఠ వేగం 445 కిలోమీటర్లు

ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్, తోబియాన్‌ హైపర్‌-జీటీ హైబ్రిడ్‌ కారును ఆవిష్కరించింది. గంటకు 445 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో, ప్రపంచంలోనే రోడ్లపై అత్యంత వేగంగా ప్రయాణించే వాహనంగా ఇది గుర్తింపు పొందనుంది. 40 మిలియన్‌ డాలర్ల (సుంకాలు కాకుండా సుమారు రూ.34 కోట్ల) ధర పలికే ఈ అత్యాధునిక కారుకు 8.3 లీటర్‌ వీ16 ఇంజిన్‌ అమర్చారు. దీనివల్ల 1000 హెచ్‌పీ శక్తినిస్తుంది. క్వాడ్‌ టర్బో డబ్ల్యూ 16 విద్యుత్తు మోటార్‌తో అదనంగా 800 హెచ్‌పీ శక్తి లభిస్తుంది. 25 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉంది. 1995 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ కార్లను మొత్తం 250 మాత్రమే రూపొందిస్తామని కంపెనీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని