domestic tech startups: దేశీయ టెక్‌ అంకురాల్లోకి రూ.34,000 కోట్లు

దేశీయ టెక్‌ అంకురాలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 4.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.34,000 కోట్ల)ను సమీకరించినట్లు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాన్సాక్షన్‌ నివేదిక వెల్లడించింది.

Updated : 21 Jun 2024 04:12 IST

ఈ ఏడాది జనవరి నుంచి ట్రాన్సాక్షన్‌ నివేదిక

దిల్లీ: దేశీయ టెక్‌ అంకురాలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 4.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.34,000 కోట్ల)ను సమీకరించినట్లు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాన్సాక్షన్‌ నివేదిక వెల్లడించింది. 2023 జులై-డిసెంబరు మధ్య సేకరించిన 3.93 బిలియన్‌ డాలర్ల (రూ.32,800 కోట్ల)తో పోలిస్తే ఇవి 4% అధికం. 2023 తొలి 6 నెలల్లో సమీకరించిన 4.8 బి.డా. (సుమారు రూ.39,800 కోట్ల) తో పోలిస్తే 13% తగ్గాయి. అంతర్జాతీయంగా టెక్‌ అంకురాలు సమీకరించిన నిధుల పరంగా, భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఫండింగ్‌ పరిమాణం పరంగా అమెరికా అగ్ర స్థానంలో ఉండగా, యూకే, చైనా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

2023లో 67 యూనికార్న్‌లు!: కొత్తగా యూనికార్న్‌ (సుమారు రూ.8,300 కోట్ల విలువైన)లుగా మారుతున్న సంస్థల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియన్‌ ఫ్యూచర్‌ యూనికార్న్‌ సూచీ తెలిపింది. వెంచర్ల లాభదాయకతపై అనుమానాల కారణంగా 25 అంకురాలు భవిష్యత్తు యూనికార్న్‌ జాబితా నుంచి జారిపోయాయని పేర్కొంది. 2023లో యూనికార్న్‌ సంస్థలు 67గా ఉన్నాయి. అంత క్రితం ఏడాది ఇవి 3 పెరిగి 68గా నమోదయ్యాయి. భవిష్యత్‌ యూనికార్న్‌ జాబితా నుంచి వైదొలగిన వాటిలో 500 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,150 కోట్ల) విలువైన అంకురాలు (గాజెల్లెస్‌) 5 కాగా, 200 మి.డాలర్ల (సుమారు రూ.2,075 కోట్ల) విలువైన అంకురాలు (ఛీతాస్‌) 20 ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో 67 యూనికార్న్‌లు, 46 గాజెల్లెస్, 106 ఛీతాస్‌ ఉన్నాయని పేర్కొంది. వీటిలో కొత్తగా జతయిన 38 కొత్త అంకురాలు కూడా ఉన్నాయని ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌ సీఈఓ, ఎండీ రాజేశ్‌ సలూజా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని